ముగించు

ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ

ప్రభుత్వ పథకాలు మరియు రాయితీ వివరములు :

1. సూక్ష్మసేద్య పథకము (కేంద్రము + రాష్ట్ర ప్రభుత్వ వాటా) :

సంఖ్య వర్గముల వారిగ ఉప కులాలు కేంద్ర ప్రభుత్వ వాటా  రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం రాయితీ వాటా
1 యస్ యఫ్/యం యఫ్ యస్ సి 33 67 100
2 యస్ యఫ్/యం యఫ్ యస్ టి 33 67 100
3 యస్ యఫ్/యం యఫ్ బి సి 37 63 100
4 యస్ యఫ్/యం యఫ్ ఇతరులు 37 63 100
5 ఇతరులు యస్ సి 27 73 100
6 ఇతరులు యస్ టి 27 73 100
7 ఇతరులు బి సి 30 70 100
8 ఇతరులు ఇతరులు 34 66 100

2. సమగ్ర ఉద్యాన పంటల అబివృద్ది మిషన్ :

క్రొత్త పండ్ల తోటల విస్తీర్ణము, 2వ/3వ సంవత్సరముల నిర్వహణ, వ్యవసాయ యాంత్రికరణ మరియు మల్చింగ్ మొదలగునవి.

  • కేంద్ర ప్రభుత్వ వాటా – 60%
  • రాష్ట్ర ప్రభుత్వ వాటా – 40%
  •  మొత్తం రాయితీ వాటా – 100%

3. రాష్ట్రీయ ప్రణాళిక  :

  •  కేంద్ర ప్రభుత్వ వాటా – 0%
  • రాష్ట్ర ప్రభుత్వ వాటా – 100%
  • మొత్తం రాయితీ వాటా – 100%

సూక్ష్మసేద్య పథకము:

బిందు సేద్యము:

తక్కువ నీటితో నాణ్యమైన దిగుబడి సాదించి దీనితో పాటు నీటి ఆదా, కరెంటు ఆదా మరియు కూలీల ఖర్చు తగ్గించుట ఈ యొక్క పథకము ముఖ్య ఉద్దేశము.
బిందు సేద్యము దరఖాస్తు చేయు రైతులు మీ-సేవ కేంద్రం ద్వారా (బయో మెట్రిక్) పద్దతిలో రైతు తన యొక్క పట్టాదారు పాస్ బుక్, ఆధర్ కార్డు మరియు RoR (I B) కాపీలతో దరఖాస్తు చేసుకోవలెను
ఈ పథకములో గరిష్టంగా 12.50 ఎకరముల వరకు బిందు సేద్యము అమర్చుకోవచును.

  • 100% రాయితీ ఫై యస్ సి,  యస్ టి రైతులకు + జియస్టి 12%
  •  90% రాయితీ బిసి, చిన్న, సన్నకారు రైతులకు + జియస్టి12%
  •  80% ఓ సి రైతులకు సబ్సిడీ  (పెద్ద రైతులకు) + జియస్టి12%

సూచన: 1) ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వము జియస్టి5% భరిస్తుంది మిగిలిన 7% వాటా రైతు బరించవలెను
తుంపర సేద్యము – ఈ పథకములో అన్నివర్గముల రైతులకు ఒకే విదమైన రాయితీ కల్పించబడును.

తుంపర సేద్య యూనిట్ ధర 75% రాయితీ 25% రైతు వాటా + జియస్టి
16671/- 12503/- 5335/-

2) సమీకృత ఉద్యాన అబివృద్ది పథకము :

క్రొత్త పండ్ల తోటలు :

పంట మొత్తం  మొత్తం రాయితీ 1.00 హె. (రూ) మొత్తం రాయితీ 1.00 హె. (రూ) మొత్తం రాయితీ 1.00 హె. (రూ) 
విస్తీర్ణము 1వ సం|| 2వ సం|| 3వ సం||
>60% 20% 20%
బత్తాయి 16001 9601 3200 3200
మామిడి 16400 9840 3280 3280
దానిమ్మ 26672 16004 5334 5334
జామ 29332 17600 5866 5866
ఆపిల్ బెర్ (రేగు) 14000 8400 2800 2800

క్రొత్త పండ్ల తోటల విస్తీర్ణ పథకములో మామిడి, బత్తాయి, జామ, దానిమ్మ, మరియు ఆపిల్ బెర్ (రేగు) మొదలగు పండ్ల తోటలు 40% రాయితీతో ఒక్క రైతుకు గరిష్టంగా 4 హె.ల విస్తీర్ణం వరకు పొలాలలో నాటుకొనుట కొరకు ఈ పథకము వర్తింప చేయబడును.

పండ్ల తోటలలో నీటి కుంటలు ఏర్పాటు చేయుట.

క్రమ సంఖ్య కుంట పరిమాణము నీటి నిలువ (లక్షలు లీటర్లు) రాయితీ (రూ.)
1 10X10X3 1.74 10,875/-
2 15X15X3 4.59 28,687.50/-
3 20X20X3 8.94 75,000/-
4 21X21X4 25.64 1,60,250/-
5 27X27X4 39.08 2,44,250/-
6 35X35X4 61.48 3,84,250/-