ముగించు

పంచాయతి రాజ్ ఇంజనీర్

పంచాయతి రాజ్, పి.ఐ.యు డివిజన్ గద్వాల పరిధి నందు 2 నియోజకవర్గములు, 3 సబ్ డివిజన్ లు అనగా గద్వాల, మనోపాడు మరియు అలంపూర్ లతో పంచాయతి రాజ్ శాఖా అభివృద్ధి పనులు అమలు పరచడమైనది. ఈ డివిజన్ నందు అన్ని గ్రామీణ పనులు అనగా సి.ఆర్.ఆర్., యం.ఆర్.ఆర్., నాబార్డ్ నిధుల ద్వారా మంజూరు కాబడిన గ్రామీణ రహదారులు మరియు పశువైద్య భవనములు, యం.పి.పి. భవనములు, స్కూల్ భవనముల పనులు నాబార్డ్, యం.పి.పి., ఎస్.ఎస్.ఎ., సి.డి.పీ., యం.పి.లాడ్స్, సి.బి.ఎఫ్ నిధుల ద్వారా వివిధ రకాల పనులు చేపట్టబడినది. అదేవిధంగా యం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు అనగా గ్రామ పంచాయతి భవనములు, మండల మహిళా సమాఖ్య భవనములు, అగ్రికల్చర్ గోడౌన్ మరియు సి.సి.రహదారులు చేపట్టుటకు జిల్లా కలెక్టర్ గారు అప్పగించారు.

గద్వాల నియోజకవర్గము లో గల మండలములు:-

  • గద్వాల.
  • గట్టు.
  • కాలురుతిమ్మన్ దొడ్డి.
  • మల్దకల్.
  • ధరూరు.

అలంపూరు నియోజకవర్గము లో గల మండలములు:-

  • అలంపూరు.
  • ఉండవెల్లి.
  • ఇటిక్యాల.
  • మనోపాడు.
  • వడ్డేపల్లి.
  • రాజోలి.
  • అయిజ.

జిల్లా ప్రొఫైల్ క్రింది విధముగా కలదు:

జిల్లాలో మొత్తం 492 రోడ్లు కలవు, ఈ రోడ్ల మొత్తం పొడవు 1727.339 కి.మీ. కలదు. ఇందులో 37.246 కి.మీ. పొడవు సి.సి.రోడ్లు, 464.917 కి.మీ. పొడవు బి.టి రోడ్లు, 256.338 కి.మీ. పొడవు కంకర రోడ్లు మరియు 465.206 కి.మీ. పొడవు మొరం రోడ్లు కలవు.

I.రోడ్లు

  •  ఎస్.టి. ఆవాసాలకు రోడ్ల నిర్మాణం (TSP): ఈ కార్యక్రమము ద్వారా 6 రోడ్ల నిర్మాణం రూ.244.00 లక్షల అంచనా విలువతో GO.Rt.No.336, dt.10.07.2017 మరియు GO.Rt.No.341, dt.04.09.2018 of Tribal Welfare (Edn.Bud) Dept., TSP నిధుల ద్వారా ఎస్.టి. ఆవాసాలకు రోడ్ల నిర్మాణము చేపట్టడము జరిగినది. ఈ మొత్తం 6 రోడ్ల పనులలో 3 పనులు పూర్తికాబడినది 3 పనులు ప్రగతిలో కలవు.
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం (CRR) 2017-18 : ఈ కార్యక్రమము ద్వారా 28 రోడ్ల నిర్మాణం రూ. 3871.00 లక్షల అంచనా విలువతో GO.Rt.No.687, dt.07.11.2017, GO.Rt.No.688, dt.07.11.2017, GO.Rt.No.700, dt.16.11.2017 & GO.Rt.No.82, dt.02.02.2018, of PR & RD (Progs-I) Dept., CRR 2017-18 నిధుల ద్వారా గ్రామీణ బి.టి. రోడ్ల నిర్మాణము చేపట్టడము జరిగినది. ఈ మొత్తం 28 రోడ్స్ పనులు ఇందులో 9 పనులు పూర్తికాబడినది 17 రోడ్ల పనులు ప్రగతిలో కలవు.
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం (CRR) 2018-19 : ఈ కార్యక్రమము ద్వారా 10 రోడ్ల సి.డి. పనుల నిర్మాణం రూ. 50.00 లక్షల అంచనా విలువతో GO.Rt.No.307, dt.16.05.2018 of PR & RD (Progs-I) Dept., CRR 2018-19 నిధుల ద్వారా గ్రామీణ సి.డి. పనుల రోడ్ల నిర్మాణము చేపట్టడము జరిగినది. ఈ మొత్తం 10 సి.డి. పనులు ఇందులో 10 సి.డి. పనులు పూర్తికాబడినది.
  • ప్రాధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన : ఈ కార్యక్రమము ద్వారా 2 రోడ్ల నిర్మాణం రూ. 918.98 లక్షల అంచనా విలువతో PMGSY నిధుల ద్వారా మంజూరు కాబడినది. 2 రోడ్డ్డులు రూ. 690.96 లక్షల వ్యయంతో పూర్తికాబడినది.
  • బ్రిడ్జి నిర్మాణము (NABARD RIDF XXI) : ఈ కార్యక్రమము ద్వారా 1 బ్రిడ్జి నిర్మాణం రూ. 247.00 లక్షల అంచనా విలువతో G.O.Rt.No.718, dt.04.12.15 of PR&RD(Progs.II) Dept., NABARD RIDF XXI నిధుల ద్వారా కే.టి.దొడ్డి మండలము లో నందిన్నె R&B రోడ్డు నుండి ఇర్కిచేడు వయా గువ్వలదిన్నె, పూజారి తాండ, తోట తాండ రోడ్డునకు బ్రిడ్జి నిర్మాణము మంజూరు కాబడినది. ఈ పని ముగింపు దశ లో ఉన్నది.
  • ఎస్.డి.ఫ్ రోడ్ల నిర్మాణం (SDF) 2018-19 : ఈ కార్యక్రమము ద్వారా 44 రోడ్ల నిర్మాణం రూ. 5561.38 లక్షల అంచనా విలువతో GO.Rt.No.681, dt.04.09.2018, of PR & RD (Progs-I) Dept., SDF 2018-19 District Collector Prodg.No. 43/SDF/CMA/2018-19, Dt.27.12.2018 నిధుల ద్వారా గ్రామీణ బి.టి. రోడ్ల నిర్మాణము టెండర్ దశ లో ఉన్నవి.
  • గ్రామీణ రోడ్ల నిర్వహణ (MRR) 2014-15 : ఈ కార్యక్రమము ద్వారా 37 రోడ్ల నిర్మాణం రూ. 2691.62 లక్షల అంచనా విలువతో G.O.Ms.No.20, dt.19.11.2014 of PR & RD (Progs-I) Dept., MRR నిధుల ద్వారా 191.59 కి.మీ. ల బి.టి రోడ్ల పునరుద్దరణ చేపట్టడము జరిగినది. మొత్తం 37 రోడ్ల పనులు పూర్తికాబడినవి.
  •  గ్రామీణ రోడ్ల నిర్వహణ (MRR) 2015-16 : ఈ కార్యక్రమము ద్వారా 39 రోడ్ల నిర్మాణం రూ. 160.00 లక్షల అంచనా విలువతో G.O.Rt.No.300, dt.13.05.2015 of PR & RD (Progs-I) Dept., MRR నిధుల ద్వారా 28.02 కి.మీ. ల మైన్టేనన్స్ రోడ్ల పునరుద్దరణ చేపట్టడము జరిగినది. మొత్తం 34 రోడ్ల పనులు పూర్తికాబడినవి.

II.భవనములు:

  • యం.పి.పి. & అతిధి భవనములు : ఈ కార్యక్రమము ద్వారా 5 భవనముల నిర్మాణం రూ. 365.00 లక్షల అంచనా విలువతో Asst.to MPP Buildings నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 3 పనులు రూ. 113.19 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి 1 ముగింపు దశ లో ఉన్నది.
  • పశు వైద్య భవనములు (NABARD RIDF) : ఈ కార్యక్రమము ద్వారా 5 భవనముల నిర్మాణం రూ. 144.00 లక్షల అంచనా విలువతో NABARD RIDF నిధుల ద్వారా మంజూరు కాబడినవి. 4 పనులు పూర్తికాబడినవి.
  • సి.డి.పీ. నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 471 పనులు రూ. 1610.75 లక్షల అంచనా విలువతో CDP నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 391 పనులు రూ. 1125.67 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • యం.పీ.లాడ్స్. నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 236 పనులు రూ. 997.22 లక్షల అంచనా విలువతో MPLADS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 168 పనులు రూ. 632.78 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • ఎస్.సి.డి.డి (SCDD) : ఈ కార్యక్రమము ద్వారా 22 పనులు రూ. 79.50 లక్షల అంచనా విలువతో SCDD నిధుల ద్వారా మంజూరు కాబడినవి. 18 పనులు పూర్తికాబడినవి.
  • ఎస్.ఎస్.ఏ (రి రూఫింగ్) : ఈ కార్యక్రమము ద్వారా 37 పనులు రూ. 78.50 లక్షల అంచనా విలువతో SSA (Re-Roofing) నిధుల ద్వారా మంజూరు కాబడినవి. 34 పనులు పూర్తికాబడినవి.
  • సి.బి.ఎఫ్ 2016-17 : ఈ కార్యక్రమము ద్వారా 179 పనులు రూ. 277.75 లక్షల అంచనా విలువతో CBF 2016-17 నిధుల ద్వారా మంజూరు కాబడినవి. 170 పనులు పూర్తికాబడినవి.
  • కౌంపౌండ్ గోడలు (హాస్పటల్స్ కు): ఈ కార్యక్రమము ద్వారా 2 పనులు రూ. 57.50 లక్షల అంచనా విలువతో CBF నిధుల ద్వారా మంజూరు కాబడినవి. 2 పనులు పూర్తికాబడినవి.
  • సి.బి.ఎఫ్ 2018-19 (హాస్పటల్స్ కు): ఈ కార్యక్రమము ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషంట్ వార్డు యందు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేయడానికి సి.బి.ఎఫ్ నిధుల ద్వారా రూ. 17.00 లక్షల మంజూరు కాబడినవి. ఈ పని ప్రగతిలో కలదు.
  • టాయిలెట్స్ (గవర్నమెంట్ స్కూళ్ళకు): ఈ కార్యక్రమము ద్వారా 218 పనులు రూ. 22.41 లక్షల అంచనా విలువతో CBF 2017-18 నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 127 పనులు రూ. 6.12 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • సి.బి.ఎఫ్ 2017-18 : ఈ కార్యక్రమము ద్వారా 149 పనులు రూ.389.28 లక్షల అంచనా విలువతో CBF 2017-18 నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 123 పనులు రూ. 255.76 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • మత్సకారుల సహకార సంఘ భవనములు : ఈ కార్యక్రమము ద్వారా 8 పనులు రూ. 80.00 లక్షల అంచనా విలువతో Fisheries Development నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 5 పనులు రూ. 56.43 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • ఎస్.డి.ఫ్. (SDF) : ఈ కార్యక్రమము ద్వారా 19 పనులు రూ. 95.00 లక్షల అంచనా విలువతో SDF నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 19 పనులు రూ. 79.90 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • వెటర్నరీ & అనిమల్ హస్బండ్రి నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 10 పనులు రూ. 12.45 లక్షల అంచనా విలువతో వెటర్నరీ & అనిమల్ హుస్బండ్రి నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 09 పనులు పూర్తికాబడినవి.
  • గ్రామపంచాయతి భవనములు (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : గత మూడు సంవత్సరముల నుండి ఈ కార్యక్రమము ద్వారా 67 పనులు రూ. 1056.00 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 11 పనులు రూ. 279.28 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి మిగిత పనులు ప్రగతిలో కలవు.
  • మండల మహిళా సమాఖ్య భవనములు (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 9 పనులు రూ. 260.00 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 8 పనులు రూ. 243.43 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • అంగన్ వాడి భవనములు (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 49 పనులు రూ. 392.00 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 18 పనులు రూ. 199.15 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • అగ్రికల్చర్ గోడాన్ (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 1 పని రూ. 40.00 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 1 పని రూ. 37.45 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • సి.సి.రోడ్ల నిర్మాణము (2016-17) (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 751 పనులు రూ. 3508.90 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 641 పనులు రూ. 2264.44 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • సి.సి.రోడ్ల నిర్మాణము (2017-18) (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 29 పనులు రూ. 126.00 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 24 పనులు రూ. 79.70 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • సి.సి.రోడ్ల నిర్మాణము (2017-18 New) (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 1094 పనులు రూ. 4992.68 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 928 పనులు రూ. 3394.19 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • సి.సి.రోడ్ల నిర్మాణము (2018-19) (యం.జి.ఎన్.ఆర్.జి.ఎస్.) నిధులు : ఈ కార్యక్రమము ద్వారా 229 పనులు రూ. 1539.50 లక్షల అంచనా విలువతో MGNREGS నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో 89 పనులు రూ. 542.15 లక్షల వ్యయంతో పూర్తికాబడినవి.
  • రెండు పడక గదుల ఇల్లు : ఈ కార్యక్రమము ద్వారా 2800 పనులు రూ. 14284.00 లక్షల అంచనా విలువతో 2BHK నిధుల ద్వారా మంజూరు కాబడినవి. ఇందులో క్యాతురు మరియు గోనుపాడు గ్రామములలో 45 పనులు ప్రగతిలో కలవు మరియు గద్వాల్ (అర్బన్)లో 468 పనులు ప్రగతిలో కలవు మరియు 92 పనులు టెండర్ దశ లో ఉన్నవి.