ముగించు

చేనేత మరియు జౌళి శాఖ

చేనేత మరియు జౌళి శాఖ

జోగులంబ గద్వాల్ జిల్లాలో(24) ప్రాథమిక నేత కార్మికులు ఉన్నారు. జిల్లాలో(కాటన్ / ఉన్ని / గార్మెంట్ / పవర్‌లూమ్స్ / టైలర్స్)సంఘాలుగ నమోదు చేయబడిన మరియు ఈ క్రింది విధంగా విభాచించబడ్డాయి.

క్రమ సంఖ్య సంఘ రకము పని చేయుచున్న సంఘాలు డార్మేంట్ సంఘాలు మొత్తం యూనిట్ల సంఖ్య
1 చేనేత సహకార సంఘాలు 8 6 14 1201
2 పవర్లూం సహకార సంఘాలు 1 1 138
3 సిల్క్ సహకార సంఘాలు 2 2 28
4 టైలర్స్ సహకార సంఘాలు 7 7 15
మొత్తం 8 16 24 4

మొత్తం జిల్లా లో సహకార రంగములో మరియు సహరేతర రంగములో 6423 చేనేత కార్మికులు కలరు. మరియు ఈ క్రింద కనపరచిన విధముగా సహకార రంగములో మరియు సహరేతర రంగములో అమలు చేయబడుచున్న వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పధకాలు:-

సంక్షేమ మరియు అభివృద్ధి పధకాలు:-

  1. సహకార సంఘములకు ఋణ పరపతి పథకము (క్యాష్ క్రెడిట్) :ఈ పథకము క్రింద ఈ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ( 5 ) సహకార సంఘాలకు రూ.111.00 లక్షల మంజూరి కాబడినవి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతి పాదనలు కోరబడుచున్నవి.
  2. ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకము :ఈ పథకము క్రింద 2019-20 ఆర్థిక సంవత్సరానికి చేనేత కార్మికులకు ఋణ సౌకర్యం కల్పించుటకు ప్రతి పాదనలు కోరబడుచున్నవి.
  3. పావలావడ్డీ పథకము:ఈ పథకము క్రింద 2018-19 సంవత్సరానికి (4) సహకార సంఘాలకు దాదాపు రూ.8.63 లక్షలను మంజూరు చేసి పని కల్పించడం జరిగింది.
  4. కామన్ ఫెసిలిటి సెంటర్ :ఈ పథకము క్రింద మాచెర్ల చేనేత సహకార సంఘానికి కామన్ ఫెసిలిటి సెంటరు నిర్మాణం కొరకు రూ.19.00 లక్షలు మంజూరు అయినది. వాటికి గాను నిర్మాణం నిమిత్తం పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కు 10% డబ్బులు బదాలాయించబడినవి.. పనులు త్వరలోనే మొదలు పెట్టడం జరుగును.
  5. చేనేత పార్క్, గద్వాల :SITP క్రింద ఈ పార్క్ ను పూడూరు గ్రామములో 47 ఏకరాలలో రూ. 1498.01 లక్షలతో అబివృద్ది చేయుటకు ప్రభుత్వమునుండి అనుమతి లభించినది. మరియు DPR రూపకల్పన జరుగుచున్నది.

సంక్షేమ పథకములు:-

  1. త్రిఫ్ట్ ఫండ్ పథకం:-రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకమును నూతనముగా ప్రవేశ పెట్టింది. చేనేత కార్మికులకు అవగాహనా సదస్సుల ద్వార ఈ పథకము యొక్క వివరములను తెలియ పరచినాము. మరియు ఇది 3 సం.// ల కాల పరిమితి . చేనేత కార్మికులు దాని అనుభంద వృత్తి వున్నవారు దీనిలో చేరుటకు అర్హులు. RD -1 మరియు RD -2 ఖాతాలను తెరిచి వారి యొక్క నెలసరి ఆదాయంలో 8 శాతము వారి యొక్క RD -1 ఖాతాలకు జమ చేసిన వాటికీ ప్రభుత్వము నుండి వచ్చే 16 శాతమును RD -2 ఖాతాలకు 3552 మంది చేనేత కార్మికులకు ఇప్పటి వరకు రూ.579.322 లక్షలు జమచేయబడినవి… ఇంకా ఏక్కువ మంది చేనేత కార్మికులను ఇందులో చేర్పించి లబ్ది చేకూర్చబడును.
  2. చేనేత మిత్రా (40 శాతం నూలు సబ్సిడీ ):-రాష్ట్ర ప్రభుత్వము ఈ పథకమును నూతనముగా ప్రవేశ పెట్టింది. చేనేత కార్మికులకు అవగాహనా సదస్సుల ద్వార ఈ పథకము యొక్క వివరములను తెలియ పరచడం జరిగినది. మరియు చేనేత కార్మికుల వివరములను ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేయడం మొదలు పెట్టడం జరిగింది. యార్న్ బిల్సు అప్ లోడ్ చేయడం జరుగుచున్నది. (3760) మాస్టర్ వివర్స్, చేనేత కార్మికులు, అన్సిల్లరి కార్మికులు 40 శాతం నూలుపై లబ్ది పొందుటకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం క్రింద రూ:47.07 లక్షలు నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి జమ చేయడం జరిగింది.
  3. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా పథకము:-ఈ పథకము క్రింద భీమా పొందుటకు చేనేత కార్మికులకు 18 సం. నుండి 50 సం.ల వయసు కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి ఉండి సంవత్సరమునకు ఒక్కొక్కరికి రూ.80 /- చెల్లించవలెను. ఈ పథకము క్రింద భీమా పొందుటకు ధరఖాస్తులను కోరుచున్నాము.
  4. ప్రధానమంత్రి సురక్ష భీమా పథకము:-ఈ పథకము క్రింద భీమా పొందుటకు చేనేత కార్మికులకు 18 సం. నుండి 50 సం.ల వయసు కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడి ఉండవలెను. ఈ పథకము క్రింద భీమా పొందుటకు ధరఖాస్తులను కోరుచున్నాము.

చేనేత మగ్గముల గణన:-

ప్రభుత్వ ఆదేశముల మేరకు ఇటివల చేనేత మగ్గముల ఇంటింటి సర్వే చేపట్టగా 2295 మగ్గములు గుర్తించడం జరిగింది. మరియు కార్వే సంస్థ వారు నిర్వహించిన జియో టాగింగ్ సర్వే లో జియో టాగింగ్ దాదాపు 2141 మగ్గములు తేలినవి.

బతుకమ్మ చీరల పంపిణి:-
జిల్లాలోని 1,85,388 మంది తెల్ల రేషన్ కార్డ్ గల మహిళలకు 1,65,280 బతుకమ్మ చీరలు పంపిణి చేయడం జరిగింది.