ముగించు

ఇరిగేషన్

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మిషన్ కాకతీయ” కార్యక్రమం క్రింద చెరువుల ఒండ్రు మట్టి పూడికతీత మరియు పునరుర్దరణ పనులు చేపట్టిన చెరువులకు మహర్దశ తీసుకునిరావడం కోసం ఈ కార్యక్రమం చేపట్టనైనది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గముల పరిధిలో, 638 చిన్న నీటిపారుదల చెరువులు ఉన్నవి. దీని క్రింద 23,370 ఎకరములకు ఆయకట్టు ప్రతిపాదించనైనది. మిషన్ కాకతీయ లో భాగంగా ఒండ్రు మట్టి తొలగించి రైతుల పంట పొలాలకు వాడుకోవడం, పాటుకాలువల, పంటకాలువల, తూములు మరియు అలుగు మరమ్మతులు చేపట్టబడును.

  • మొదటి దశ మిషన్ కాకతీయ: గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గముల పరిధిలోని 8 మండలాల క్రింద 111 చెరువులకు పునరుర్దరణ పనులు చేపట్టి, 4696.00 ఎకరముల ఆయకట్టును సాగులోకి తీసుకురావడం జరిగినది. కాంట్రాక్టు ఒప్పందముల విలువ రూ. 1220 లక్షలు, మొదటి దశ మిషన్ కాకతీయ క్రింద పనులు పూర్తి అయినవి.
  • రెండవ దశ మిషన్ కాకతీయ: గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గముల పరిధిలోని 6 మండలాల క్రింద 92 చెరువులకు పునరుర్దరణ పనులు చేపట్టనైనది. ఈ దశలో 4963.00 ఎకరముల ఆయకట్టును సాగులోకి తీసుకురావడం జరుగుతున్నది, కాంట్రాక్టు ఒప్పందముల విలువ రూ. 1252.00 లక్షలు, వీటిలో 66 పనులు పూర్తి అయినవి, 20 పనులు పురోగతిలో ఉన్నవి మరియు 6 పనులు పట్టా భూములు ఉన్నందున రైతులు ఆక్సపన తెలిపినారు కావున, పనులను రద్దు పరుచుటుకు ప్రతిపాదనలు పంపనైనది.
  • మూడవ దశ మిషన్ కాకతీయ: గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గముల పరిధిలోని 6 మండలాల క్రింద 96 చెరువులకు పునరుర్దరణ పనులు చేపట్టనైనది. ఈ దశలో 4843.00 ఎకరముల ఆయకట్టును సాగులోకి తీసుకురావడం జరుగుతున్నది, కాంట్రాక్టు ఒప్పందముల విలువ రూ. 1211.00 లక్షలు, 26 పనులు పూర్తి అయినవి మరియు మిగిలిన 61 పనులు పురోగతిలో ఉన్నవి మరియు 9 పనులు పట్టా భూములు ఉన్నందున రైతులు ఆక్సపన తెలిపినారు కావున, పనులను రద్దు పరుచుటుకు ప్రతిపాదనలు పంపనైనది.
  •  నాల్గవ దశ మిషన్ కాకతీయ: క్రింద 43 చెరువులకు పునరుర్దరణ పనులు చేపట్టనైనది. ఈ దశలో 2407.00 ఎకరముల ఆయకట్టును సాగులోకి తీసుకురావడం జరుగుతున్నది. దీనికి ప్రతిపాదించిన అంచనా విలువ రూ. 613.00 లక్షలు, కాంట్రాక్టు ఒప్పందముల విలువ రూ. 442.00 లక్షలు, 10 పనులు పూర్తి అయినవి మరియు మిగిలిన 33 పనులు పురోగతిలో ఉన్నవి.
  •  ఐదవ దశ మిషన్ కాకతీయ: క్రింద 15 చెక్ డ్యామ్ లను ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాo. చెక్ డ్యామ్ లకు అనుమతులు రాగానే టెండర్లకు పిలుస్తాం. చెక్ డ్యామ్ లతోపాటు కాల్వలకు తూములను ఏర్పాటు చేసి చెరువులను నీటితో నింపి ఆయకట్టును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
  • మినీ ట్యాంక్ బండ్:
  • గద్వాల నియోజకవర్గములోని సంగాల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించుటకు పరిపాలన అనుమతులను రూ.579 లక్షలకు పొందడం జరిగినది. 356 లక్షలకు అగ్రిమెంట్ జరిగి పని పురోగతిలో ఉన్నది మరియు అలంపూర్ నియోజకవర్గములోని పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించుటకు పరిపాలన అనుమతులను రూ.556 లక్షలకు పొందడం జరిగినది దీనికి అగ్రిమెంట్ జరిగి పని పురోగతిలో ఉన్నది.
  • మిషన్ కాకతీయ కార్యక్రమం క్రింద చెరువులను అభివృధి చేయడము వలన భూగర్భజలాలు పెరగడం జరిగినది, చెరువుల క్రింద ఆయకట్టు అభివృధి జరిగి జోగులాంబ గద్వాల జిల్లాలో వలసలను నివారించనైనది, చేపల పెంపకం జరిగి మత్సకార్మికులకు ఉపాధి కల్పించబడినది మరియు ఈ మిషన్ కాకతీయ కార్యక్రమములో భాగంగా 975000.00 క్యూబిక్ మీటర్ల ఒండ్రు మట్టిని రైతులు తమ పంట పొలములకు వాడడంవలన రసాయనిక ఎరువుల వాడకం తగ్గినది.