ముగించు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA)

  1. ఆసరా పించనులు:

        జిల్లాలో ఈ పధకము ద్వారా క్రింద తెలిపిన వృద్దులకు, వితంతువులకు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడి కార్మికులు మరియు దైలాసిస్ పెన్షన్ నెలనెల రూ.2016/- వికలాంగులకు నెలనెల రూ.4016/- పంపిణి చేయడం జరుగుచున్నది.       

   క్రమ సంఖ్య

వివరములు

పించినుదారుల సంఖ్య

డిసెంబర్-2023 మంజూరి పంపిణి జనవరి,2024 (రూ.లక్షలలో)

1.

వృద్దాప్య పించన్లు

25892

541.87

2.

వితంతువు పించన్లు

29802

634.47

3.

వికలాంగుల పించన్లు

11514

461.37

4.

చేనేత కార్మికుల పించన్లు

1608

32.70

5.

కల్లు గీత కార్మికుల పించన్లు

380

7.99

6.

బీడి కార్మికుల పించన్లు

51

1.03

7.

ఓటరి స్త్రీలకు జీవన బృతి

2173

46.14

8.

దైలాసిస్

62

1.24

 

మొత్తం

71482

1726.81

పెన్షన్ పంపిణీ విధానం:

ద్వారా

పెన్షన్ల సంఖ్య

మొత్తం

By Banks

32473

Rs.7,46,02,560/-

By Post Office

39009

Rs.9,80,78,608/-

Total

71482

Rs.17,26,81,168/-

పెన్షన్ల మొత్తం :

5 జిల్లాలకు సంబందించిన HIV/AIDS పెన్షన్ @ Rs. 2016/-   2322       Rs.46.81 lakhs.

జనవరి,2023 నుండి ఇప్పటి వరకు క్రొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్లు

S.No

MANDAL NAME

New Sanctions Total

Total Amount (Rs.in.lakhs)

 
 

1

Alampur

59

1.19

 

2

Dharur

101

2.04

 

3

Gadwal

118

2.38

 

4

Ghattu

108

2.18

 

5

Ieej

120

2.42

 

6

Itikyal

102

2.06

 

7

K.T.Doddi

62

1.25

 

8

Maldakal

155

3.12

 

9

Manopad

66

1.33

 

10

Rajoli

65

1.31

 

11

Undavelly

73

1.47

 

12

Waddepalle

26

0.52

 

13

Gadwal(Mun)

81

1.63

 

14

Ieeja(Mun)

85

1.71

 

15

Waddepalle(Mun)

31

0.62

 

16

Alampur(Mun)

38

0.77

 

 

Total

1290

26.01

 
  1. సంస్థాగత నిర్మాణము (ఐ.బి ):

      మౌళిక, సామాజిక, ఆర్థిక అవసరాలు తీరే విధంగా, గ్రామీణ నిరుపేదలకు అవకాశలు పెంపొందిచడంతో పాటు అన్ని వర్గాలకు చెందినవారు తమ సామ సామర్థ్యలను వినియోగించుకోవడంతో అడ్డుపడుతున్న అసమానతను తొలగించి వారి కాళ్ళమీద వారే నిలబడేలా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.

  1. జిల్లా సమాఖ్య – 01
  2. మండల సమాఖ్యలు – 12     
  3. గ్రామ సంఘాల సంఖ్య – 311
  4. మొత్తం గ్రూపులు – 6,787
  5. సభ్యుల సంఖ్య – 66,386
  1. మహిళా స్వయం సహాయక బృందాలకు బ్యాంకుల ద్వారా నేరుగా ఋణ సదుపాయం కల్పించుట (Bank Linkage) : 

       2023-2024 సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజి లక్ష్యం 4074 సంఘాలు, 170.71 కోట్లు ఈ పథకము ద్వారా ఇప్పటి వరకు   3260 సంఘాలకు రూ.190.00 కోట్లు ఋణ సదుపాయము కల్పించడమైనది. 

      (Rs.in.Crores)

 

సంవత్సరం

లక్ష్యం

అచీవ్మెంట్

 

         %

సమూహం

మొత్తం

సమూహం

మొత్తం

2023-2024

4074

170.71

3260

190.00

111%

  1. స్త్రీనిధి (మహిళా బ్యాంక్ ):

         బ్యాంక్ లింకేజికి అదనముగా ఆత్యవసర సమయంలో స్వయం సహాయక సంఘ సభ్యులకు బుణాలు అందించుట ఈ పథకము ద్వారా 2023-2024 సంవత్సరానికి గాను లక్ష్యం 21.00 కోట్లు ఈ పథకము ద్వారా ఇప్పటి వరకు 140 సంఘాలకు మరియు సంఘాసభ్యులు 436 గాను రూ.369.60 లక్షలు ఋణసదుపాయము కల్పించడమైనది.

      5. నాన్-ఫార్మ్ (Enterprises):

         2023-24 జోగులాంబ గద్వాల జిల్లాలో 311 గ్రామ  సంఘాలు కలవు, వ్యవసాయేతర(Nonfarm) సంబందించి ప్రతి గ్రామ సంఘానికి 6 చొప్పున 3256 Enterprises ను లక్ష్యంగా వున్నది. అందులో 3256 existing ఎంటర్ ప్రైజెస్ మరియు న్యూ ఎంటర్ ప్రైజెస్ గుర్తించడం జరిగినది.  ఇప్పటి వరకు 3344  న్యూ Enterprises స్థాపించడం జరిగినది.

  సంవత్సరం

లక్ష్యం

అచీవ్మెంట్

%

2023-2024

3256

3344

103%.

     6. వరిధాన్యం కొనుగోలు (Marketing):

       2023-24 జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో సన్నకారు, చిన్నకారు రైతులు పంచించిన వ్యవసాయ ఉత్పతులు (వరి ధాన్యము) మద్దతు ధర కల్పించుట కొరకు ఈ పథకము ద్వారా వానాకాలం సీజన్ లో (49) కొనుగోలు కెంద్రాలను ఏర్పాటు చేసి ఇంతవరకు 60 మంది రైతుల నుండి 4488 Qtls వరిధాన్యం కొనుగోలు చేసి రూ.93.75 లక్షలు రైతు ఖాతాలో జమచేయడం జరిగినది మరియు 2022-23 సంవత్సరంలో వానాకాలం సీజన్ లో 2570 మంది రైతుల నుండి 187000 Qtls మరియు యాసంగి లో 3584 మంది రైతుల నుండి 295113 Qtls వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగినది. 

సంవత్సరం

ఋతువు

రైతులు

క్వింటాల్

 

2022-23

వానకాలం

2570

187000

యాసంగి

3584

295113

2023-24

వానకాలం

60

4488

7.Custom Hiring Center (సెంటర్):

        మల్దకల్ మండలంలో “వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలు అద్దెకు ఇచ్చు కేంద్రం “CHC” రూ.25,00,000/- లతో ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా నూతనంగా మరో (05) మండలాలు అనగా గద్వాల్, ఆలంపూర్, కె.టి.దొడ్డి, ధరూర్ మరియు అయిజ రూ.45,00,000/- తో  ఈ కార్యక్రమాన్ని విస్తరించడం జరిగినది. ఈ కేంద్రాలలో అద్దె ప్రాతిపదికన వ్యవసాయ యంత్రాలను ట్రాక్టర్స్, ట్రేషర్స్, పవర్ వీడర్స్, పవర్ స్పెడర్స్ మరియు డ్రోన్స్ మొదలైన పరికరాలు అద్దెకి ఇవ్వటానికి సిద్ధంగా వున్నాయి.

8.ప్రధానమంత్రి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారి పథకం (Prim Minister Formalisation of Micro Food Enter Prises):

         2023-24:- సంవత్సరానికి జోగులాంబ గద్వాల జిల్లాలో PMFME క్రింద 83 యూనిట్ లక్ష్యం చేయాల్సివుండగా  ఇది వరకే  56 యూనిట్లను రూ.99.41 లక్షలు మంజూరు చేయడం జరిగినది. ఇట్టి యూనిట్ల ద్వారా మహిళలు స్వయం ఉపాది పొందుతూ కల్తీలేని నాణ్యమైన ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. PMFME (సీడ్ క్యాపిటల్) ద్వారా ఇది వరకే స్థాపించిన యూనిట్లకు ఒక్కొక్క లబ్దిదారునికి రూ.40,000/- చొప్పున 186 మంది లబ్దిదారులకు రూ.72.71 లక్షలను ప్రతిపాదనలను సీఈఓ,సెర్ప్,హైదరాబాద్ వారికి ఆన్ లైన్ లో పంపడం జరిగినది.

9.ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపని (FPC) :

             ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపని  ద్వారా ఇప్పటి వరకు 55 FPG గ్రూప్ లను తయారు చేయడం జరిగినది.  537 రైతుల నుండి 7,28,000/- లను షేర్ కాపిటల్ గ్రాంట్ క్రింద పొందండం జరిగినది.  FPC ద్వారా మక్కలు,కోర్రలు, బత్తాయిలు రూ.12,50,000/- వ్యాపారం చేయడం జరిగినది.

10. వికలాంగుల అభివృద్ధి కార్యక్రమాలు :

       సదరం కార్యక్రమము ద్వారా వికలాంగులకు 28,925 వికలత్వ నిర్ధారణ నిర్వహించడము జరిగినది.  అందులో 18,776 మంది 40% శాతము పైబడి అర్హత పొందినారు.  ప్రసుత్తం 11563 మంది ఆసరా పెన్షన్ నెలనెల లబ్దిపొందుతున్నారు.           

       వికలాంగుల కొరకు నైబర్ హుడ్ సెంటరులు (NHC) ధరూర్, గట్టు మరియు మల్దకల్  మండలాలలో నిర్వహిస్తున్నారు.  కోవిడ్ వచ్చినప్పటి నుండి సెంటర్ కి పిల్లలు రావటం లేదు.  సిబ్బంది ఇంటి౦టికి తిరిగి వికలాంగులకు సేవలు అందిస్తున్నారు.

మొత్తం పిల్లల వివరాలు ఈ క్రింద పొందు పరచడం జరిగినది.  

క్రమ సం.

కేంద్రం పేరు

Strength of Children

సిబ్బంది

1.

ధరూర్

25

3

2.

గట్టు

25

3

3.

మల్దకల్

20

3

 

:: మొత్తం ::

70

9