ముగించు

విద్యా శాఖ

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సమీకృత పథకాలు:

సమగ్ర శిక్ష: పాఠశాల విద్యపై సమీకృత పథకాలు పూర్వ పాథమిక, పాథమిక, పాథమికోన్నత, ఉన్నత మరియు సీనియర్ సెకండరీ స్థాయి వరకు నిరంతర విద్య ను అందిస్తుంది. విద్య లో సుస్థిర అబివృద్ధి లక్ష్యాల (SDG)కు అనుగుణంగా పూర్వ పాథమిక నుండి సీనియర్ సెకండరీ దశ వరకు సమగ్రమైన మరియు సమానమైన నాణ్యమైన విద్యను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం

 • పాఠశాల విద్య లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు:
 • లక్ష్యం SDG-4.1 “2030 నాటికి, బాలబాలికలందరూ ఉచిత, సమానమైన మరియు నాణ్యమైన పాథమిక మరియు మాధ్యమిక విద్యను సంబంధిత మరియు సమర్థవంతమైన అభ్యాస ఫలితాలకు దారితీసేలా పూర్తి చేయాలని నిర్దేశించబడిందని” పేర్కొంది.
 • ఇంకా SDG 4.5 ప్రకారం, “2030 నాటికి, విద్యలో లింగ అసమానతలను తొలగించండి మరియు వికలాంగులు, స్థానిక ప్రజలు మరియు హానికర పరిస్థితుల్లో ఉన్న పిల్లలతో సహా బలహీనులకు అన్ని స్థాయిల విద్య మరియు వృత్తిపరమైన శిక్షణకు సమాన పాధాన్యత నిర్ధారించండి”.
 • పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు నాణ్యమైన విద్యను అందించడం మరియు విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం; పాఠశాల విద్యలో సామాజిక మరియు లింగ అంతరాలను తగ్గించడం; పాఠశాల విద్య యొక్క అన్ని స్థాయిలలో సమానత్వం మరియు చేరికను నిర్ధారించడం; పాఠశాల నిబంధనలలో కనీస ప్రమాణాలను నిర్ధారించడం; వృత్తివిద్యాను పోత్సహించడం; పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య (RTE) చట్టం, 2009 అమలులో రాష్ట్రాలకు మద్దతు; మరియు ఉపాధ్యాయ శిక్షణ కోసం నోడల్ ఏజెన్సీలుగా SCERTలు/స్టేట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు డైట్‌లను బలోపేతం చేయడం మరియు అప్-గేడేషన్ చేయడం. ఈ పథకం యొక్క ప్రధాన ఫలితాలు యూనివర్సల్ యాక్సెస్, ఈక్విటీ మరియు క్వాలిటీ, వృత్తివిద్యాను పోత్సహించడం మరియు ఉపాధ్యాయ విద్యా సంస్థల (TEIలు) బలోపేతం చేయడం.
 • సమగ్ర శిక్ష అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల కింద ఒక సమగ్ర పథకం. ఇది సమగ్ర శిక్ష కింద అనేక జోక్యాలతో మూడు కేంద్ర పాయోజిత పథకాలైన సర్వ శిక్షా అభియాన్ (SSA), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA) మరియు ఉపాధ్యాయ విద్య (TE)లను విలీనం చేయడం ద్వారా విద్యార్థులకు మరియు పాఠశాల మౌలిక సదుపాయాలను అందిస్తుంది. 
 1. విద్యా హక్కు చట్టం కింద పోత్సాహకాలు:

సమగ్ర శిక్షా సమానత్వ లక్ష్యాన్ని సాధించడానికి సమగ్ర శిక్ష విద్యార్థులకు ఏక రూప దుస్తులు మరియు పాఠ్య పుస్తకాల పంపిణి చేయబడినవి. ఈక్విటీ అంటే సమాన అవకాశం మాత్రమే కాదు, సమాజంలోని వెనుకబడిన వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ పిల్లలు, భూమిలేని వ్యవసాయ కార్మికులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు మొదలైనవారు – అవకాశాన్ని ఉపయోగించుకునే పరిస్థితులను సృష్టించడం కూడా. ప్రభుత్వం ఈక్విటీ మరియు యాక్సెస్‌ను పిల్లలకు ఈ అర్హతలను పొందే హక్కుగా చేసింది.

 • మద్యాహ్న భోజన పథకము:
 • జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు  ఈ పథకము ద్వారా మధ్యాహ్న భోజనం అందజేయబడుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరము2023-24 గాను MDM బడ్జెట్ నిధులు మొత్తం రూ.5,14,17,600/- ఈ జిల్లాకు కేటాయించబడ్డాయి మరియు ఇట్టి నిధులు సంబంధిత MEOల ద్వారా MDM ఏజెన్సీలకు మరియు వంట వండు కార్మికులకు చెల్లింపుల కొరకు విడుదల చేయబడినవి.
 • MDM నిధుల చెల్లింపు వివరాలు:
 • I నుండి VIII తరగతుల వరకు కుకింగ్ కాస్ట్ క్రింద జూలై-2023 వరకు విడుదల చేయబడిన నిధులు MEO లచే చెల్లింపులు చేయబడినవి.
 • IX మరియు X తరగతుల కుకింగ్ కాస్ట్ క్రింద సెప్టెంబర్ 2023 వరకు విడుదల చేయబడిన నిధులు MEO లచే MDM ఏజెన్సీ లకు ట్రెజరీ ద్వారా చెల్లించబడ్డాయి.
 • ఎగ్ కాస్ట్ (egg cost) నిధులు సెప్టెంబర్ 2023 వరకు విడుదల చేయబడ్డాయి. అట్టి నిధులు MDM ఏజెన్సీలకు చెల్లించబడ్డాయి.
 • వంట వండు కార్మికులకు యొక్క గౌరవ వేతనాలు@ 1000/- ప్రకారంగా PFMS పోర్టల్ ద్వారా జూలై -2023 వరకు నిధులు విడుదల చేయబడి మరియు  చెల్లింపులు చేయబడినవి.
 • రాష్ట్ర ప్రభుత్వం నుండి అదనపు కమిట్ మెంట్ @ 2000/- లకు వంట కార్మికులకు గౌరవ వేతనం రూ.2,19,78,000/- రూపాయలు విడుదల కాగా మరియు అంతే మొత్తము అన్ని మండలాలకు రిలీజ్ చేయబడ్డాయి. అట్టి నిధులను MEOలు ప్రతి నెల ఒక్కక్కరికి @ 2000/- చొప్పున వంట కార్మికులకు ట్రెజరీ ద్వారా చెల్లింపులు చేయబడుతాయి. ఇప్పటివరకు సెప్టెంబర్ 2023 చెల్లింపులు చేయబడినవి, అక్టోబర్ 2023 సంబందించి జీతాలు ట్రెజరీ నందు పెండింగ్ లో వున్నవి.
 • ఈ విద్యా సంవత్సరం నుండి జిల్లాలోని గల అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం వేళలో బలవర్ధక పోషకాలు గల రాగిజావా అందజేయడం జరుగుతున్నది.
 • అల్పాహార పథకం క్రింద విడతల వారిగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించ బడింది. మొదటి విడతగా తేది:06.10.2023 నాడు రెండు పాఠశాలలో ఈ పథకం ప్రారంభించబడింది. రెండవ విడతగా తేది:26.10.2023 నాడు జిల్లాలోని అదనముగా 14 పాఠశాలలో ఈ పథకం ప్రారంభించబడింది. 

సమగ్ర శిక్షా అభియాన్: 

 • యు – డైస్(U-DISE ) 2023-24:

సమగ్ర శిక్ష లో భాగంగా ప్రతి విద్యాసంవత్సరం ప్రాథమిక స్థాయి నుండి సీనియర్ సెకండరీ స్థాయి విద్య వరకు వివిధ యాజమాన్యాలు నిర్వహిస్తున్న పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థుల ఉపాధ్యాయుల మరియు మౌలిక వసతుల సేకరణకు యు డైస్ 2023-24  ద్వారా  సేకరించడం ప్రారంభమైనది ఇందులో భాగంగా విద్యార్థుల యొక్క ప్రమోషన్ ప్రక్రియ, విద్యార్థులు నమోదు స్కూల్ డైరెక్టరీ లోని మార్పులు చేయడం నూతన పాఠశాలలు చేర్చడం జరుగినది. ఈ సంవత్సరానికి సంబంధించి పాఠశాలలోని మౌలిక వసతులు మొదలగు అంశాల సేకరణ, ఉపాద్యాయుల వివరాలు సేకరించడం చివి దశలు ఉన్నది. సేకరించిన సమాచారం లోని వాస్తవాలు పర్యవేక్షించబడుచున్నవి. ICT లో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రతి మండల  వనరుల కేంద్రానికి 6 కంప్యూటర్ లు, 51ఉన్నత పాఠశాలలో L1, L2 కేటగిరీలలో L1-10, L2-5 కంప్యూటర్ లు UPS, ప్రింటర్, టేబుల్స్, నెట్ వర్క్  పరిసరాలు పంపిణీ చేయడమైనది.

ఈ సంవత్సరం నుండి ప్రతి విద్యార్థికి పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెం (PEN) ను వారి TC/Bonafide Record షీట్, SSC మెమో లపై ముద్రించడం జరుగుచున్నది. దీని కోసం ప్రతి విద్యార్ధిని UDISE లో తప్పని సరి నమోదు చేయాలి. అంతే కాకుండా ఈ సంవత్సరం SSC నామినల్ రోల్ కుడా UDISE ఆడారంగానే తిసుకోబడినది.

AWP & B – 2024-25 & 2025 – 26

రాబోవు విద్యా సంవత్సరం 2024-25 కు సంబంధించి సమగ్ర శిక్ష పథక నిర్వహణ కై  బడ్జెట్  ప్రతిపాదనలు చేయవలెనని . ఇందులో సమగ్ర శిక్ష పథకంలో భాగంగా పాఠశాల అభివృద్ధి , పాఠశాలల పర్యవేక్షణ విద్యాభివృద్ధి , లింగ సమానత , బాలిక విద్య, వృత్తి విద్యా, దివ్యంగుల విద్యా, ప్రోత్సాహం, కమ్యూనిటి నిర్వహణ, పథక నిర్వహణ వంటి వాటి కై బడ్జెట్ ప్రతిపాదనలు చేయబడును.

అదే విధంగా 2025-26 సంవత్సరానికి సంబంధించి పర్స్పెక్టివ్ బడ్జెట్ ప్రతిపాదనలు పంపదమైనది.

 • కే.జి.బి.వి.:

జిల్లాలో 12 కె.జి.బి.వి.లలో ఎస్.సి., ఎస్.టి., మైనారిటీ, బి.పి.ఎల్. బాలికలు (3373) మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఇట్టి 12 కె.జి.బి.వి.లలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుకోవడానికి వీలు కల్పించబడినది. జోగుళాంబ గద్వాలలో గద్వాల, వడ్డేపల్లి, గట్టు ,అలంపూర్ ఇంటర్ నందు MPC, BI.P.C గ్రూపులు అయిజ, మనోపాడు కె.జి.బి.విలో ఇంటర్ నందు C.E.C, MPHW గ్రూపులు ప్రారంబిoచబడినవి. జోగుళాంబ గద్వాల జిల్లాలో పట్టణ వీధి బాలల కోసం అర్బన్ రెసిడెన్సియల్ స్కూల్  ( తెలుగు మీడియం), ఎర్రవల్లి చౌరస్తా దగ్గర 129 మంది విద్యార్థులతో నిర్వహించబడుతుంది.

12 కె.జి.బి.వి పాఠశాలల్లో విద్యార్ధినిలందరికి కార్పెట్లు మరియు దుప్పట్లు పంపిణి చేయడం జరిగినది. అదేవిధంగా అమ్మాయిలందరికి జూన్ నుండి ఫిబ్రవరి వరకు నెలకు 100రూ.ల స్టైఫండ్ చొప్పున రూ. 19,44,800/-విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది.  కలెక్టర్ మేడమ్ చొరవతో,హైదరాబాద్‌లోని సరోజినీ స్మార్ట్ లెర్నింగ్ ద్వారా VI నుండి X తరగతి విద్యార్థులకు వేద గణిత కార్యక్రమాన్ని (4 నెలలు) ప్రవేశపెట్టాము, ఫలితంగా గణిత భయాన్ని తొలగించి, బాలికలందరిలో గణితాన్ని సరళంగా మరియు తార్కికంగా చేయడానికి వీలు కల్పించింది.

2023-24 విద్యా  సం. రానికి రాష్ట్ర  స్థాయిలో పి‌జి‌సి‌ఆర్‌టి / సి‌ఆర్‌టి /PET  పోస్టులకు పరీక్ష జరిగినది.   మెరిట్ పద్దతిన రోస్టర్ ప్రకారం జోగులంబ గద్వాల్ జిల్లాలో 5 CRT మరియు 21  PGCRT పోస్టులకు నియామకం జరిగినది.2024-25 సంవత్సరానికి జిల్లాలోని మల్దకల్, ఉండవెల్లి KGBV పాఠశాలలో ఇంటర్మీడియట్ స్థాపనకై ప్రతిపాదనలు పంపడం జరిగినది. 

 • ఏకరూప దుస్తుల పంపిణీ:  

2023-24 సంవత్సరమునకు గాను జోగుళాంబ గద్వాల జిల్లాలోని అన్నిప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు ప్రతి సంవత్సరం సమానత్వము  కింద రెండు జతల యూనిఫారాలు అందజేస్తారు. ఈ ఏడాది 65176 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున(100%) యూనిఫాంలను పంపిణీ చేయబడ్డాయి.

 • పాఠశాలలలో మిషన్ భగీరథ మంచినీటి సౌకర్యం:

జోగుళాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ పథకం 458 పాఠశాలలకు మిషన్ భగీరథ మంచినీటి కనెక్షన్ ఇవ్వడం జరిగినది.

 • రవాణా చార్జిల విడుదల:

 జోగుళాంబ గద్వాల్ జిల్లాలో 2022-23 సంవత్సరంలో పాఠశాలలు లేని ఆవాస ప్రాంత విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళుటకు ప్రాథమిక స్థాయిలో 267, ప్రాథమిక ఉన్నత స్థాయి లో 568 మరియు ఉన్నత స్థాయి లో 262 మంది విద్యార్థులకు మొత్తంగా 1097 మంది విద్యార్థులకు రవాణా భత్యానికి ప్రతిపాదనలు పంపడం జరిగినది. ఇందుకు గాను రాష్ట్ర కార్యాలయం నుండి ప్రాథమిక మరియు ప్రాథమిక ఉన్నత స్థాయి లో 835 మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి లో 212 విద్యార్థులకు మొత్తంగా 1047 విద్యార్థులకు మంజూరు కావడం జరిగినది. లబ్ది పొందిన విద్యార్థుల వివరాలను మరియు నెలవారీ హాజరు సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంతర్జాలం లో నమోదు చేయడం జరిగింది.

2023-24 విద్యా సంవత్సరానికి ఎలిమెంటరీ స్థాయిలో 689 సెకండరీ స్థాయిలో 463 మొత్తంగా 1152 మంది విద్యార్థులకు రవాణా భత్యం ప్రతిపాదనలు పంపడమైనది. కాగా  వీటి 1049 మంది కై మంజూరు కాబడిన ఇట్టి నిధులు విడుదల కావలసి ఉన్నది. 2024-25 విద్యా సంవత్సరానికి రవాణా భాత్యానికై ఎలిమెంటరీ స్థాయిలో 181 & ఉన్నత స్థాయిలో 105 మొత్తం 285 మందికి ప్రతి పాదనలు పంపదమైనది.

 • ప్రాథమిక పాఠశాలలో FLN ( Foundational Literacy & Numeracy) అమలు :

      ప్రాథమిక పాఠశాల స్థాయిలో FLN కార్యక్రమాలను తొలిమెట్టు అను పేరుతో కొనసాగుతున్న కార్యక్రమం ఈ విద్యా సంవత్సరం కుడా సరి కొత్తగా ప్రారంభించబడింది. ఉపాధ్యాయులకు కరదీపికలు, ప్రతి విద్యార్థికి 3( తెలుగు, గణితం, ఇంగ్లీష్) చొప్పున అందించబడ్డాయి. వీటి వినియోగానికి సంబంధించిన శిక్షణా కార్యక్రమము జిల్లా మరియు మండల స్థాయిలో నిర్వహించబడ్డాయి. ఈ విధంగా మొత్తం 9760 ఉపాద్యాయ కరదీపికలు, 1,20,168  వర్క్ షీట్ బుక్ లు జిల్లా కు  SCERT, హైదరాబాద్ వారి నుండి అందించబడ్డాయి.6 వ  తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులలో ఉన్న అభ్యసనా లోపాన్ని పూడ్చేందుకు “ఉన్నతి” కార్యక్రమాన్ని SCERT వారి ఆధ్వర్యం లో ప్రామ్భించబడింది. దీనిలో విద్యార్థులకు learning అవుట్ కమ్స్ అభ్యసనా సామర్థ్యాలు సాధించడానికి ప్రణాలికలు శిక్షణా కార్యక్రమాల ద్వారా తెలియబడినది. మరియు ఉపాధ్యాయులకు, ప్రదానోపాద్యయులకు 1260 కరదీపికలు కూడా అందించబడినవి.

      పదవ తరగతి విద్యార్థులలో సత్పలితాలి సాధించుటకు “లక్ష్య “ అను కార్యక్రమాన్ని ప్రత్యేక కార్య చరణ మరియు లగు పరిక్షల నిర్వహణ, పర్యవేక్షణ తదితర అంశాల ద్వారా నిర్వహించబడింది.

      జిల్లా లోని 9 ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 9,10 తరగతుల విద్యార్థులకు వృత్తి విద్య అందించబడుచున్నది ప్రతి పాఠశాలలో వృత్తి విద్యా శిక్షకుల ద్వారా రెండేసి చొప్పున వృత్తి విద్యాలు భోదించబడుచున్నవి.

 • బడి బయటి పిల్లల సర్వే (2023):

ఈ  విద్యా సంవత్సరములో 1108 మంది  6-14 సం.మధ్య వయస్సు గల  బడిబయటి పిల్లలను బడి బయటి పిల్లల సర్వే (2023) ద్వారా గుర్తించడం జరిగింది. వీరిని పాఠశాలలో చేర్పించే విధంగా CRP లు మరియు SMC కమిటీ ఉపాధ్యాయులు తగిన ప్రణాళికలు వేసుకుని వారందరిని పాఠశాలలో చేరే విధంగా చేస్తున్నారు . 730 మందిని వివిధ పాఠశాలలో చేర్చినారు . ఈ సంవత్సరం బడి బయట పిల్లల సర్వే 11 డిసెంబర్ 2023 ణ ప్రారంభమై 10 జనవరి 2024 వరకు జరుగుచున్నది.

 • మన ఊరు మన బడి/మన బస్తి మన బడి:

మన ఊరు మన బడి/మన బస్తి మన బడి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమనగా పాఠశాలల గదుల మరమ్మత్తులు, పూర్తి శిథిలావస్థ తరగతి గదుల స్థానం లో నూతన గదుల నిర్మాణం, ఫర్నిచార్ ఏర్పాటు, టాయిలెట్స్,  డిస్టల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటు విడతల వారిగా అమలు పర్చుటకు ప్రతిపాదించనైనది. మొదటి విడతలో భాగంగా 461   పాఠశాలల నుండి 161 పాఠశాలలు ఎంపిక కాబడినవి.   

క్ర.సం.

మండలం

మొత్తం పాఠశాలలు

మొదటి విడతలో ఎంపిక కాబడిన పాఠశాలలు

1

కేటి దొడ్డి

36

12

2

ధరూర్

45

15

3

గద్వాల్

66

23

4

ఇటిక్యాల

50

18

5

మల్దకల్

40

13

6

గట్టు

48

17

7

అయిజ

55

19

8

రాజోలి

22

8

9

వడ్డేపల్లి

23

9

10

మనోపాడ్

22

8

11

ఉండవెల్లి

23

8

12

ఆలంపూర్

31

11

 

మొత్తం

461

161

             మొదటి విడతలో ఎంపికైన 161 పాఠశాలల్లో 118 పాఠశాలలు 30 లక్షలలోపు  అంచనా వ్యయం ఉన్నవి మరియు 43 పాఠశాలలకు అంచనా వ్యయం 30 లక్షలా పైన ఉన్నవి. 161  పాఠశాలల్లో 161 పాఠశాలల్లో పనులు ప్రారంభమైనవి. ఈ పాఠశాలలకు గాను రూ.183.76/- లక్షలు  నిధులు మంజూరు అయినవి.ఇప్పటి వరకు 16పాఠశాలలు ప్రారంభమైనవి 33 పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. మిగితా పాఠశాలలో పనులు పురోగతి లో ఉన్నాయి.

 • ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (IFP):

                    మన ఊరు మన బడి మన బస్తీ మన బడి, కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (IFP) సరఫరా చేయబడింది. మొదటి దశలో 52 పాఠశాలలు 156 IFPలను అందుకున్నాయి, దశ-II & III, 74 పాఠశాలలు 179 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లను అందుకోబోతున్నాయి. IFP డిస్ప్లేలు ఇంటరాక్టివ్ వైట్‌బోర్డింగ్, వీడియోకాన్ఫరెన్సింగ్, స్క్రీన్ షేరింగ్ మరియు మరిన్నింటి కోసం రూపొందించబడిన సహకార పరిష్కారాలు. విద్యార్థుల దృష్టిని ఆకర్షించే మరియు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఇంటరాక్టివ్ పాఠాలు, క్విజ్‌లు మరియు కార్యకలాపాలను రూపొందించడానికి  ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయి. 

 • PM – SHRI (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా):

  ఇందులో భాగంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలోని ప్రభుత్వ పాఠశాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు పీఎం శ్రీ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం Phase-I లో భాగంగా మన జిల్లాలో 114 పాఠశాలలకు గాను 12 పాఠశాలలు ఎంపిక కావడం జరిగినది వీటిని రాబోవు ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేయడం కోసమై పాఠశాల వారీగా బడ్జెట్ ప్రణాళికలు రూపొందించడం జరిగినది ఈ ప్రణాళిక మొత్తం బడ్జెట్ 2,62,383(లక్షలలో) గా ప్రతిపాదనలు రాష్ట్రానికి పంపించడం జరిగినది ఈ విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలకు నిధులు మంజూరై అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర కార్యాలయ సూచన మేరకు చేపట్టబడును. జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో Phase-I, PMSHRI పథకం నందు 12 పాఠశాలలు ఎంపిక కావడం జరిగినది. ఈ సంవత్సరం Phase-II క్రింద 114 బెంచ్ మార్క్ పాఠశాలలు తమ పాఠశాలలోని భౌతిక వనరులను 26.08.2023 లోగా నమోదు చేసుకున్నాయి. 67 పాఠశాలలను రాష్ట్ర స్థాయి అప్రోవాల్ కొరకు ప్రతిపాదనలు పంపబడ్డాయి.

 • ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట:

  బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరము ఒకటవ తరగతిలో 376 మంది విద్యార్థులు అంగన్వాడి నుండి, 105 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుండి, 169 మంది విద్యార్థులు నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడమైనది మొత్తంగా 4786 మంది విద్యార్థులు ఒకటవ తరగతిలో నమోదయ్యారు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 2261 మంది విద్యార్థులు చేరడమైనది ఇందుకు కారణం పాఠశాలలో ఏర్పరిచిన మౌలిక వసతులు  డిజిటల్ తరగతులు, ఇంటర్నేటివ్ ఫ్లాట్ ప్యానల్స్ బెంచీలు డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు.

 • DSE-ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) – హాజరు:

పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో (రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థ, TSREIలు, KGBVలు, URS పాఠశాలలు) FRS యొక్క మొబైల్ యాప్ ద్వారా పాఠశాల పిల్లల రోజువారీ హాజరును సంగ్రహించడానికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును అమలు చేయడం జరుగుతుంది. FRS కింద సంగ్రహించిన విద్యార్థుల హాజరు ముఖ్యమంత్రి అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, జాతీయీకరించిన పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు మొదలైనవి అందించడం కోసం పరిగణించబడుతుంది.

 అన్నింటిని కూడా పాఠశాలలో ఏర్పాటు చేసి కార్పొరేట్ కు దీటుగా పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగింది.