ముగించు

విద్యుత్ శాఖ

దీన్దయాళ్ఉపాధ్యాయ్గ్రామీణజ్యోతిపథకం:

భారత దేశంలోని ప్రతి గ్రామీణ ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలనే లక్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం తెలంగాణలో ఏప్రిల్ 2017 లో ప్రారంభం అయ్యింది. గ్రామ విద్యుద్దీకరణ, విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్ఠ పరచడం, పేదలకు(దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు) రూ.125/- కే విద్యుత్ కనెక్షను ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.125/- కే సర్వీస్ వైర్, బోర్డు,ఒక ఎం.సి బి,ఒక బల్బు ఇచ్చి ఇంటికి అమర్చి విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాకి రూ.16.15 కోట్లతో 25,616 విద్యుత్ కనెక్షన్లు, 2 33/11 కే.వి. ఉపకేంద్రాలు, 290 సింగల్ ఫేజ్ 25 కే.వి.ఏ. ట్రాన్స్ఫార్మర్లు మంజూరు అయ్యాయి. గద్వాల జిల్లాలో 25616 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంకాగా సిబ్బంది మరియు ప్రజల సహకారంతో 33165 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు.అందులో అందరికీ అనగా 33165 గృహాలకు మీటర్లు బిగించి విద్యుత్ అందిచడం జరిగింది. ఈ పథకం క్రింద 260 సింగల్ ఫేజ్ 25 కే.వి.ఏ. ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం జరిగింది. ఈ ట్రాన్సఫార్మర్ల వల్ల గ్రామాల్లో ఉన్న లో వోల్టేజ్ సమస్య పరిష్కరించబడుతుంది. అదే విధంగా ఎల్. టీ కేబుల్ పనులు 124 కిలోమీటర్ల కు గాను 83.2 కిలోమీటర్ల పనులు జరిగాయి. గద్వాల జిల్లాలో ఈ పథకం కింద రాజ శ్రీ గార్లపాడు (గ్రా) ఇటిక్యాల (మం), ఇందువాసి (గ్రా) గట్టు (మం) లలో 33/11 కే.వి. ఉపకేంద్రాల నిర్మాణం పనులు పూర్తి అయి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

సంసద్ ఆదర్శ గ్రామ యోజన(ఎస్. ఎ. జి. వై) పథకం క్రింద మాజీ ఎమ్. పి, శ్రీ నంది ఎల్లయ్య గారు దత్తత తీసుకున్న అమరవాయి గ్రామం(మల్దకల్ మండలం)లో 210 మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.125/- లకే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. గ్రామంలో కొత్తగా 3 ట్రాన్సఫార్మర్లను అమర్చడం జరిగింది. 6 ట్రాన్సఫార్మర్లకు ఎర్థింగ్ మరమ్మత్తు పనులు చేయడం జరిగింది. కొత్తగా 3-ఫేజు 5వైర్ లైను పనులు 3.5 కిలోమీటర్ల మేర, కేబుల్ లైన్ 1.375 కిలోమీటర్ల పనులు చేయడం జరిగింది. ఈ ఆదర్శ గ్రామానికి 24.715 లక్షలు వెచ్చించి విద్యుత్తు పనులు చేయడం జరిగింది.

సమగ్రవిద్యుత్అభివృద్ధిపథకం (IPDS):

పట్టణాల్లోని విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచడానికి, కొత్త సబ్ స్టేషన్లు నిర్మాణానికి, కొత్త ట్రాన్సఫార్మర్లు మరియు ట్రాన్సఫార్మర్లకు మీటర్లు బిగించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఐ. పి. డి. ఎస్ అనే పథకంను ఏర్పాటుచేసారు. గద్వాల పట్టణంలో 100 కె.వి. ఏ ట్రాన్సఫార్మర్లు 70 సాంక్షన్ కాగా 70 ను అమర్చడం జరిగింది అలాగనే 160కె వి ఏ ట్రాన్సఫార్మర్లు 2 సాంక్షన్ కాగా, ఈ 2 ట్రాన్సఫార్మర్లు అమర్చడం జరిగింది. 11కే. వి లైన్ పనులు 7.5 కి. కి.మీటర్లు, ఎల్. టీ లైన్ పనులు 30 కి.మీటర్లు, 11కే వి. ఎబి కేబుల్ పనులు 2 కి.మీటర్లు, ఎల్. టీ ఎ. బి కేబుల్ పనులు 5 కి.మీటర్లు పూర్తి చేయడం జరిగింది. 25 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది.

అయిజ పట్టణంలో ఐ. పి. డి. ఎస్ స్కీo క్రింద ఒక 33/11 కె వి సబ్ స్టేషన్ 8 ఎం.వి.ఏ. పవర్ ట్రాన్సఫార్మర్ తో పూర్తి చేయడం జరిగింది. అయిజ పట్టణంలో 100 కె.వి. ఏ ట్రాన్సఫార్మర్లు 40 అమర్చడం జరిగింది. అలాగనే 160కె వి ఏ ట్రాన్సఫార్మర్లు 4 సాంక్షన్ కాగా, ఈ 4 ట్రాన్సఫార్మర్లు అమర్చడం జరిగింది. 11కే. వి లైన్ పనులు 3.5 కి.మీటర్లు, ఎల్. టీ లైన్ పనులు 12 కి.మీటర్లు పూర్తి చేయడం జరిగింది.

33 /11కె.వి. ఉపకేంద్రాలు : 

జోగులాంబ గద్వాల జిల్లాలో తెలంగాణ ఏర్పడే నాటికి 36 ఉపకేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9 ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టి, పూర్తి చేసి వాడుకలోకి తీసుకురాబడినవి. మరియు 12 ఉపకేంద్రాల నిర్మాణం పూర్తి అయ్యి ఆపరేటర్లు లేక వాడుకలోకి రాలేదు, 3 ఉపకేంద్రాల నిర్మాణ పని పూర్తి అయ్యి పి.టి.ర్. కేటాయింపు కోసం ఉన్నవి, 9 ఉపకేంద్రాల నిర్మాణ పనులు జరుగుచున్నవి, 2 ఉపకేంద్రాలకు ( పాల్వాయి (గ్రా) మల్డకల్ (మం), జూలకల్ (గ్రా) వడ్డేపల్లి (మం)) భూమి కేటాయింపు జరగాల్సి ఉంది మరియు ఉలిగపల్లి (గ్రా) మల్డకల్ (మం) ఉపకేంద్ర ప్రతిపాదన అనుమతి కావాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడలలో నివసించే దళితులు, ఎస్ టి వాడలాలో / తాండల లో నివసిస్తున్న గిరిజనులు, అధికారిక విద్యుత్ కనెక్షన్ మీటర్ కలిగివుండి, మీటరు ఎవరి పేరు మీద ఉంటే వారి యొక్క కుల ధృవీకరణ పత్రం తహశీల్దారు ఇచ్చినది / సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి ఇచ్చినది / రేషన్ కార్డు / పట్టాదారు పాసుపుస్తకాలు ప్రతిని విద్యుత్ శాఖ సిబ్బందికి ఇచ్చి, వారినుండి ముట్టినట్లుగా సంతకం తీసుకొని, నెలకు 101 నూట ఒక్కటి యూనిట్ల లోపు విద్యుత్ వాడుకుంటే, వారి విద్యుత్ బిల్లులను ప్రభుత్వ సోషియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ / ఎస్ సీ కార్పొరేషన్, ఎస్ టి కార్పొరేషన్ వారు వినియోగదారుల తరుపున నేరుగా విద్యుత్ శాఖ వారికి చెల్లిస్తారు, ఆ దళిత, గిరిజన విద్యుత్ వినియోగదారులు బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు. అధికారిక విద్యుత్ కనెక్షన్ మీటర్ లేని వారు వెంటనే 1,725/- రూపాయల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్, అప్లికేషన్, కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, మొదలగు పత్రాలను విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రాల్లో (అలంపూర్ క్రాస్ రోడ్ / గద్వాల ) సమర్పించి, ముట్టినట్లుగ రశీదు పొందినట్లతే అర్హులైన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. నెలకు 101 నూట ఒక్కటి యూనిట్లకు మించి వాడుకున్న వారికి ఈ పథకం వర్తించదు, వారే మొత్తం విద్యుత్ బిల్లు చెల్లించాలి. జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 28,600 దళితుల ఇండ్లు, 2,550 గిరిజనుల ఇండ్లు ఉన్నట్లు సమాచారం. కానీ విద్యుత్ శాఖ దస్త్రల ప్రకారముగ కేవలం 5,798 ఇండ్లకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు సమర్పించారు, వారు ఈ ఉచిత విద్యుత్ పథకం ఫలితాన్ని పొందుతున్నారు. 6,778 ఇండ్లకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు దళితులు అని, 677 ఇండ్లకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు గిరిజనులని అప్లికేషన్ నమోదు సమయములో తెలిపారు, కానీ వారి కుల ధృవీకరణ పత్రాలను అందచేయలేదు.

SPA:PE scheme (వ్యవసాయ పంపుల కోసం ప్రత్యేక ప్రాజెక్టులు ) :

ఈ పథకం ద్వారా వ్యవసాయ బోరు మోటార్లకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వబడును. ఈ పథకంలో ఒక్క 5 HP మోటార్ కి రూ. 5,780/- డిడి రూపంలో చెల్లించినచో, ఒక్క డిడి కి రూ. 70,000/- చొప్పున విద్యుత్ శాఖ వారు భరించి, కావాల్సిన అన్ని మెటీరియల్ సమకూర్చి, గుత్తేదారుచే పని చేయించి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వబడును. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి ఈ రోజు వరకు సుమారు రూ. 105 కోట్లతో గద్వాల జిల్లాలో 17060 వ్యవసాయ బోరు మోటార్లకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వబడింది.

ఈ పథకంలో భాగంగా దళిత, గిరిజన రైతులు కేవలం రూ. 25/- చెల్లించి దరఖాస్తు పెట్టుకుని మిగతా డిడి డబ్బులు మరియూ ఓ.ఆర్.సి డబ్బులు సాంఘిక సంక్షేమ శాఖ వారు చెల్లించినచో ఒక్క దరఖాస్తుకి రూ. 70,000/- చొప్పున విద్యుత్ శాఖ వారు భరించి, కావాల్సిన అన్ని మెటీరియల్ సమకూర్చి, గుత్తేదారుచే పని చేయించి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వబడును. ఇప్పటి వరకు జోగులాంబ గద్వాల జిల్లాలో 184 దరఖాస్తులురాగా వాటిలో 182 అర్జీలకు సాంఘిక సంక్షేమ శాఖ వారు డబ్బులు చెల్లించారు, వాటిలో 120 వ్యవసాయ బోరు మోటార్లకు విద్యుత్తు కనెక్షన్ ఇవ్వబడింది మరియు మిగతా వాటి పనులు ప్రగతి లో ఉన్నాయి.

మిషన్భగీరథపథకం :

ప్రతి ఇంటికి త్రాగు నీరు అందించాలని ఉద్ధేశ్యం తో తెలంగాణా ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకానికి విద్యుత్తు సరఫరా చేయడం కోసం రూ. 5.12 కోట్లతో రేవులపల్లి, ధరూరు (మం) లో విద్యుత్ ఉపకేంద్రం నిర్మించబడింది. అలాగే రూ. 85 లక్షలతో ధారగట్టు, ధరూరు (మం) కి విద్యుత్ సరఫరా ఇవ్వబడింది.

ఇందిర జల ప్రభ పథకం కింద విద్యుద్దీకరించుటకు 148 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాటిలో 124 వ్యవసాయ కనెక్షన్లు 1.36 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగింది. 5 వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ. 9.5 లక్షలు డి.ఆర్.డి.ఓ. గద్వాల వారు చెల్లించిన వెంటనే పనులు చేపట్టడం జరుగును