ముగించు

మహిళా , శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖా

          మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్దుల శాఖ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాసంక్షేమ అధికారి ఆధ్వర్యంలో సంక్షేమకార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రింది కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుంది.

          అంగన్వాడి సేవా పథకము(ASS), బాలల పరిరక్షణ పథకము (ICPS), బాలసదనం, సఖి (One Stop Centre), దివ్యాంగులకు ఎయిడ్స్ మరియు ఉపకరణాల పంపిణీ, దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహకం, దివ్యాంగులకు ఆర్థిక సహాయం మరియు తల్లిదండ్రులు మరియు వయోవృద్దుల నిర్వహణ మరియు సంక్షేమచట్టం, 2011 అమలు మొదలైనవి.

సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (అంగన్వాడి సేవలు): 

జిల్లాలో ప్రస్తుతం (656)ప్రధాన అంగన్వాడీ  కేంద్రాలు మరియు జనవరి 2024 నుండి  (57)మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ  కేంద్రాలు గా మార్చడం జరిగింది (మొత్తం: 713 AWCs) మంజూరి అయినవి. ఖాళీల భర్తీ కై ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది.

అంగన్వాడి సేవలు :

  • శిశు సంరక్షణ, అభివృద్ధి మరియు విద్య.     
  • సంరక్షణ మరియు పోషణ సలహాలు
  • ఆరోగ్య సేవలు      
  • కమ్యూనిటీ సమీకరణ, అవగాహన, మరియు సమాచారం. 

ఆరోగ్య లక్ష్మి:

          గర్భిణీ&బాలింతలలో పోషక స్థితి మెరుగు లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం ఆరోగ్య లక్ష్మి ద్వారా”ఒక పూట సంపూర్ణ భోజనం” అందిస్తున్నది.ఇట్టి కార్యక్రమం జోగుళాంబ గద్వాల్ జిల్లా నందు  జనవరి 2015 నుండి అమలులో వుంది.

 ప్రాజెక్ట్ వారీగా లబ్ధిదారులు:-

 

క్రమ.సంఖ్య

 

జిల్లా పేరు

                                    ఆరోగ్యలక్ష్మిలో లబ్ధిదారులు

గర్భిణీలు

    బాలింతలు 

7M-3yrs

పిల్లలు

 

     3-6 yrs పిల్లలు

1

గద్వాల్ అర్బన్

1870

1474

8586

6181

2

మల్దకల్

1851

1554

8843

5502

3

మనోపాడు

1690

1489

7752

5085

 

జోగుళాంబ గద్వాల్

5411

4517

25181

16768

ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా లబ్దిదారులు పొందేవి :

  • ప్రతిరోజూ ఒక పూట భోజనముతో పాటు గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులందరికీ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు మరియు 200 మి.లీ పాలు ఇస్తారు.     
  • 7 నె – 3 సం|| పిల్లలకు 15 రోజులకి 8గుడ్లు మరియు 2.5 kgs బలామృతం ఇంటికి ఇస్తారు.      
  • 3 నుండి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రతిరోజూ ఒక పూట భోజనం కాకుండా ఉడకబెట్టిన కోడి గుడ్డు, పౌష్టిక విలువ గల తినుబండారo (స్నాక్స్) ఇవ్వబడును.    

          జిల్లాలోని అన్నీ అంగన్వాడి కేంద్రాలకు నేరుగా పాలు, కందిపప్పు, నూనె మరియు గుడ్లు సరఫర చేస్తున్నారు, బలవర్ధకమైన సన్న బియ్యంను సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ వారు సరఫర చెస్తున్నారు. ఈ సరఫరాలన్ని కూడా బయోమెట్రిక్ సంతకం ద్వారా జరుగుతున్నాయి. ఇందు వల్ల అక్రమాలకు తావు లేకుండా ఉంటుంది. 

పోషణ్అభియాన్ :

    సంపూర్ణ పోషణ సందేశంప్రతి ఇంటికి చేరుకోవడమే లక్ష్యంగా మార్చి, 2018 నుండి పోషణ అభియాన్ జిల్లాలో అమలు చేయబడుతోంది. పోషణ్ అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యాలు

  1. పిల్లలలో కురచదనాన్ని తగ్గించడం.
  2. పిల్లలలో అతితీవ్ర లోపపోషణ తగ్గించడం
  3. చిన్న పిల్లలు, మహిళలు మరియు కౌమార బాలికలలో రక్తహీనతను తగ్గించడం
  4. తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం.
  5. మా జిల్లాలో అతితీవ్ర లోప పోషణ ఉన్న పిల్లలకోసం (SAM & MAM) సుపేర్విసేడ్ సప్లిమెంటరీ ఫీడింగ్ కార్యక్రమం ప్రారంభించబడింది. రెగ్యులర్ బాలమ్రుతం స్థానంలో తీవ్రమైన లోపపోషణ ఉన్న పిల్లలకు బాలమ్రుతం + ఆహారం ఇవ్వబడుతుంది.

          ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్, ఆహార, ప్రజా పంపిణీ శాఖల సమన్వయ౦తో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాo.

     మార్చ్ నెలలో బాగంగా పోషణ్ పక్షం అనే కార్యక్రమం, ఆగష్టు నెలలో మొదటి వారం తల్లి పాల వారోత్సవాలు మరియు సెప్టెంబర్ నెలలో 1-30 వరకుపోషణా మాసం నిర్వహించడం జరుగుతుంది. గ్రామా స్తాయిలో రోజువారి కార్యక్రమాలు అంగన్వాడి టీచర్స్ ద్వారా నిర్వహించటం జరుగుతుంది

 సమగ్ర బాలల సంరక్షణ పథకము (ICPS) : –            

          సంరక్షణ మరియు రక్షణ అవసరమయ్యే 0 – 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలను రక్షించడానికి జిల్లలో ఐ.సి.పి.ఎస్ నిర్వహించబడుచున్నది.

  • క్లిష్ట పరిస్థితుల్లో పిల్లల శ్రేయస్సు మెరుగుదలలకు దోహదం చేయడం
  • బాల్యాన్ని దుర్వినియోగం, నిర్లక్ష్యం, దోపిడీకి దారితీసే పరిస్థితుల పై చర్య తీసుకుని

    పిల్లలను రక్షించటo.

  • ఆపదలో లో ఉన్న బాలలను రక్షించడానికి 1098 టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది .

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో 255 VCPC (Village Child Protection Committee ) చేయడం జరిగింది . VCPC ద్వారా గ్రామస్థాయిలో బాల్యవివాహాలు , బాల్య కార్మికులు , బాలల పై లైంగిక వేధింపులు, అనాధ బాలలు , నిరక్ష్యకు గురైన బాలలు, ఎ ఆధారం లేని బాలలు మరియు HIV బారిన పడిన పిల్లల రక్షణ కోసం గ్రామస్థాయి లో నివారణకు సంబంధించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఈ కమిటీ ద్వార జరుగుతుంది.

MCPC (Mandal Child Protection Committee) అన్ని మండలాలో మండల బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది . అన్ని మండలాల అధికారులతో పాటు మండలంలోని పంచాయతి కార్యదర్శుల అంగన్వాడి టీచర్లు అందరికి బాల్యవివాహాల పైన మరియు వాటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది.

బాల్యవివాహ నిర్ములన కోసం జిల్లా స్థాయిలో సంబందిత శాఖా అధికారులతో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించడం జరిగింది. 

ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ :-       

జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో స్మైల్ అని, జూలై నెలలో ముస్కాన్ అనే కార్యక్రమాలను పోలీస్ శాఖ, కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ లైన్, రెవెన్యూ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం తప్పిపోయిన చిన్నారులను గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం. అదేవిధంగా బాలకార్మికులను గుర్తించి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మరియు పిల్లలకు తాత్కాలిక పునరావాసం తో పాటు పాఠశాలలో చేర్పించడం. అదేవిధంగా భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి రక్షించడం మరియు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారు చదువుకునేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలను రక్షించి వారిని తిరిగి పాఠశాలలో విద్యను కొనసాగించడం జరుగుతుంది.

జోగులంబ గద్వాల జిల్లాలో ఆడపిల్లల సంరక్షణ కోసం జిల్లా బాలల సంరక్షణ విభాగం తరపున ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జాతీయ మరియు అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా బ్రూణ హత్యలు, లింగనిర్ధారణ, బాల్యవివాహాలు, లైంగిక మరియు శారీరక వేధింపులపై రక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, విద్య యొక్క ఆవశ్యకత వంటి అంశాలపై  బాలికలను చైతన్యపరచడం జరుగుతుంది.

           జిల్లాలో పిల్లల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోనైనది. వేరు వేరు కార్యాలయాలుగా పని చేస్తున్న ఐ.సి.పి.ఎస్, బాలల సంక్షేమ కమిటీ, 1098 హెల్ప్ లైన్ , JJB, SJPU, NCLP మరియు DPO 7 యూనిట్లు అన్నీకలపి “బాల రక్షా భవన్”పేరుతో ఒకే కార్యాలయంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తునాం…

అత్యాచారానికి గురైన బాలికలకు, మహిళలకు ఆర్ధిక సాయం రూ.25,000/- నుంచి రూ.1,00,000/- ఇవ్వబడుతుంది

భేటీ బచావో – బేటి పడావో– DHEW :-

జోగులంబ గద్వాల్ లో “జిల్లా మహిళా సాధికారత కేంద్రం” మహిళల  రక్షణ మరియు సాధికారత, ఆడ పిల్లల కొరకు  భేటీ బచావో – బేటి పడావో లోబాగంగా లింగ వివక్షతను రూపుమాపడం బాలికల సంక్షేమం  మరియు రక్షణ కొరకు పనిచేయడం జరుగుతుంది.

చిల్ద్రెన్ హోం (బాల సదనం) 

జోగులాంబా గద్వాల్ జిల్లలో చిల్డ్రన్ హోమ్ పనిచేస్తోంది. అనాధ మరియు పాక్షిక అనాధ బాలికలను బాల సదనంలో చేర్చి వారికి ఉచితవసతి కల్పిస్తారు. వారికి పాఠశాల విద్యను అందిస్తారు. 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు వారికి సంరక్షణ, విద్య సదుపాయాలు కల్పిస్తాము.

దివ్యాంగుల సంక్షేమం :

జోగులాంబా గద్వాల్ జిల్లా లో 18,714 మంది దివ్యాంగులు ఉన్నారు.అవసరమైన దివ్యాంగులకు ఈ క్రింది సహాయాలు పంపిణీ చేయబడును మూడు చక్ర్రాల సైకిల్, సంక కర్రలు, ల్యాప్టాప్లు, హియరింగ్ ఎయిడ్, మోటరైజ్డ్ వాహనాలు, 4 జి మొబైల్స్ మరియు చక్రాల కుర్చీలు ఆన్లైన్ లో దరకాస్తు  చేసుకున్నవారికి (OBMMS) ద్వారా ఇవ్వబడును.

దివ్యాంగుల సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వ స్కాలర్షిప్లు, వివాహ ప్రోత్సాహకాలు మరియు పరికరాలు అందించడం. జరిగింది. ఇందులో భాగంగా మోటార్ వెహికల్స్  65, ల్యాప్టాప్లు 16, ట్రైసైకిల్లు 78, వీల్ చైర్స్ 22,  వినికిడి పరికరాలు 63, బ్లైండ్ స్టిక్స్ 26, వాకింగ్ స్టిక్స్ 28, బ్యాటరీ వీల్చైర్స్ 4, స్మార్ట్ ఫోన్ 2, సంక కర్రలు 47,   మొ||వి మొత్తం=351 అందజేయబడినవి. పెళ్లి కనుక కింద 102 ఇవ్వడం జరిగింది. అర్హులైన (39) మందికి ERS  ప్రోత్సాహం క్రింద అంజేయబడినవి. మరియు పోటీ పరీక్షలకొరకు 4 ని. కోచింగ్ కు పంపడం జరిగింది.

ప్రస్తుతానికి కొన్ని( వీల్ చైర్స్, మూడు చెక్రాల సైకల్ , బ్లైండ్ స్టిక్స్ , సంక కర్రలు, హియరింగ్ ఎయిడ్)   పరికరాలు ఆన్లైన్TSOBMMS.cgg.gov.in   లో దరకస్తూ చేసుకునే సదుపాయం కలదు.

దివ్యాంగుల యొక్క సేవలకై హెల్ప్ లైన్ నెంబర్- 1800-572-8980

 వివాహ ప్రోత్సాహకాలు:

దివ్యాంగుడికి వివాహం చేసుకున్న సాధారణ వ్యక్తికి వివాహ ప్రోత్సాహకంగా ఒక లక్ష రూపాయలు  ఆన్లైన్ లో దరకాస్తు  చేసుకున్నవారికి (EPASS) ద్వారా మంజూరు చేయబడుతోంది.

 ఆర్థిక సహాయం:-

స్వయం ఉపాధి కార్యక్రమాల ఏర్పాటుకు గాను అవసరమైన దివ్యాంగులకు సబ్సిడీ లోన్స్ ఆన్లైన్ లో దరకాస్తు  చేసుకున్నవారికి (OBMMS) ద్వారా ఇవ్వబడును.

సఖి (One Stop Centre):– 

సఖి వన్ స్టాప్ కేంద్రం, జోగులాంబ గద్వాల్.

నిర్భయ ఘటన తర్వాత మహిళల రక్షణ కోసం దేశంలో సఖి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

* మన తెలంగాణ ప్రభుత్వం కూడా 33 జిల్లాలో ” మహిళా శిశు సంక్షేమ శాఖ కింద సఖి కేంద్రాలను ఏర్పాటు చేశారు. మన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జులై – 2019 నుండి సఖి కేంద్రం 24 గంటలు పని చేస్తుంది.

* ఈ సఖి కేంద్రం యొక్క ముఖ్య ఉదేశ్యం:-హింసకు గురి అయినా మహిళలకు ఒకే చోట వైద్య, కౌన్సెలింగ్, పోలీస్, న్యాయ సహాయం మరియు తాత్కాలిక వసతి ఉచితంగా అందించడం.

* గృహహింస, వరకట్న వేధింపులు, పనిచేసేచోట వేధింపులు, లైoగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణ కోసం మహిళ హెల్ప్ లైన్ 181 కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.

*  సఖి  కేంద్రం శ్రామిక వికాస కేంద్రము అనే స్వచ్చంద  సంస్థ ఆద్వర్యములో నిర్వహించడం జరుగుతుంది.

 * సఖి కేంద్రం ఫోన్ నెం:08546-272250.

* వ్యక్తిగత మరియు దంపతుల ఇద్దరికి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి  రాజీ చేసి , వారికి పునరావాసం కల్పించడం జరుగింది.

*  జిల్లలో సఖి కేంద్రం గురిoచి అందరికి తెలియడానికి అవగాహన సమావేశాలు కుడా నిర్వహిస్తునారు.

 

Helpline Numbers:

                           Sakhi Toll Free No-181, Center No :-08546-272250

                              Child Labour & Child Marriage -1098

                              Anganwadi -155209