ముగించు

సఖి కేంద్రం

సఖి వన్ స్టాప్ సెంటర్ జోగులాంబ గద్వాల్ జిల్లా

నిర్భయ ఘటన తరువాత మహిళల రక్షణ కోసం దేశంలో సఖి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా 33 జిల్లాలలో మహిళ శిశు సంక్షేమ శాఖ కింద మన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జూలై 2019లో ఇందిరా ప్రియదర్శిని సపోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. మన జిల్లలో సఖి కేంద్రం కొత్త బస్టాండ్ ఎదురుగా సాయి కృపా హాస్పిటల్ పక్కన కలదు. సఖి కేంద్రం 24 గంటలు పని చేస్తోంది.

సఖి కేంద్రం యొక్క ముఖ్య ఉదేశ్యం:

హింసకు గురి అయిన మహిళలకు ఒకే చోట వైద్య, కౌన్సిలింగ్, పోలీస్, న్యాయ సహాయం మరియు తాత్కాలిక వసతి ఉచితంగా అందించడం.

గృహహింస, వరకట్న వేధింపులు, పనిచేసే చోట వేధింపులు, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణ కోసం మహిళ హెల్ప్ లైన్ 181 కు ఫోన్ చేయండి.

సఖి కేంద్రంలో బాధిత మహిళలకు ఉచిత సలహా, కౌన్సిలింగ్, రక్షణ కల్పించబడతాయీ.

సఖి కేంద్రాన్ని ఎప్పుడైనా సంప్రదించావచ్చు.